కరోనాకు పురుషులే ఎందుకు టార్గెట్ అవుతున్నారు?.. గుట్టువిప్పిన శాస్త్రవేత్తలు
- పురుషులతో పోలిస్తే మహిళల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ
- ప్రమాదకారక కణాలను నాశనం చేసే టి-కణాల విడుదల వారిలోనే అధికం
- యేల్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
అమెరికాలోని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. 18 ఏళ్లకు పైబడిన 98 మంది కొవిడ్ బాధితులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసినట్టు పరిశోధకులు తెలిపారు. కరోనా సోకిన తర్వాత శరీరంలోకి ప్రవేశించే ప్రమాదకారక కణాలను నాశనం చేయడంలో రోగ నిరోధక వ్యవస్థలోని టి-కణాలు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. వైరస్ సోకిన తర్వాత పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ కణాలు అధికంగా విడుదలవుతున్నట్టు అధ్యయనంలో తేలినట్టు వివరించారు.