Tirumala: వచ్చే నెల 19న ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Srivari Brahmotsavalu will start from september 27
  • మళ్లీ కళకళలాడనున్న తిరుమల గిరులు
  • సెప్టెంబరు 18న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ 
  • 27న ధ్వజారోహణంతో ముగియనున్న ఉత్సవాలు
వచ్చే నెల నుంచి తిరుమల గిరులు మళ్లీ కళకళలాడనున్నాయి. సెప్టెంబర్ 18న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా, 19న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 23న గరుడసేవ, 24న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 26న రథోత్సవం నిర్వహించనున్నారు. 27న శ్రీవారి చక్రస్నానం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. 28న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం నిర్వహించనున్నారు. కాగా, సెప్టెంబరు 1న పద్మనాభ వ్రతం, 17న మహాలయ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Tirumala
Tirupati
Brahmotsavalu
Andhra Pradesh

More Telugu News