Bigg Boss Tamil 3: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన నటి వనితా విజయ్‌కుమార్ భర్త

Bigg Boss Tamil 3 fame Vanitha Vijaykumars husband Peter Paul hospitalised
  • ప్రస్తుతం నిలకడగానే పీటర్‌పాల్ ఆరోగ్యం
  • తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు
  • వివాదాలతో ఇటీవల వార్తల్లోకి ఎక్కిన వనిత
సినీ నటి, తమిళ బిగ్‌బాస్ ఫేం వనితా విజయ్‌కుమార్‌ భర్త పీటర్‌పాల్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పీటర్‌పాల్‌ను ఆమె ఇటీవలే మూడో వివాహం చేసుకున్నారు. చాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన వారికి వనిత కృతజ్ఞతలు తెలిపింది.

కాగా, వనిత మూడో వివాహం సినీ వర్గాల్లో పెను చర్చకు, వివాదానికి కారణమైంది. ఆమె మూడో పెళ్లిని నటి కస్తూరి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్, నిర్మాత రవీంద్రన్‌ వంటివారు తప్పుబట్టారు. ఇది క్రమంగా ముదిరి ఆపై పోలీసు కేసుల వరకు వెళ్లింది. వనిత, లక్ష్మీరామకృష్ణన్‌లు పరస్పరం పరువునష్టం దావాలు కూడా వేసుకున్నారు.
Bigg Boss Tamil 3
Vanitha Vijaykumar
Peter Paul
chest pain

More Telugu News