తమన్నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్
- ఇన్స్టా ద్వారా వెల్లడించిన తమన్నా
- ఇతర కుటుంబసభ్యులు సేఫ్
- అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పిన తమన్నా
వెంటనే అందరం కోవిడ్ పరీక్షలు చేయించుకున్నామని... ఇప్పుడే రిపోర్టులు వచ్చాయని తెలిపింది. దురదృష్టవశాత్తు తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిందని చెప్పింది. తనతో పాటు ఇతర కుటుంబసభ్యులకు నెగెటివ్ వచ్చిందని తెలిపింది. మీ అందరి ప్రేమాభిమానాలతో వారు త్వరగా కోలుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.