విజయ్ స్టామినా.. 'మాస్టర్'కు ఓటీటీ నుంచి ఫ్యాన్సీ ఆఫర్!
- విజయ్ నటించిన తాజా చిత్రం 'మాస్టర్'
- లాక్ డౌన్ కారణంగా ఆగిన విడుదల
- పోటీపడుతున్న నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్
- ఓటీటీ సంస్థల నుంచి 100 కోట్ల వరకు ఆఫర్
ఈ క్రమంలో పలు ఓటీటీ సంస్థలు ఈ చిత్రాన్ని డిజిటల్ వేదికగా డైరెక్టు రిలీజ్ చేయడానికి హక్కుల కోసం ప్రయత్నించాయి. అయితే, విజయ్ తో పాటు అభిమానుల ఒత్తిడి కారణంగా థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్ర నిర్మాత ఇన్నాళ్లు ఆగారు. కానీ, ఇప్పట్లో థియేటర్లు తెరచుకునే సూచనలు కనపడకపోవడంతో మళ్లీ ఓటీటీ సంస్థలు ఈ చిత్రం కోసం ట్రై చేస్తున్నాయి.
ఈ క్రమంలో రెండు, మూడు రోజులుగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలు పోటీపడుతూ భారీ రేటు ఆఫర్ చేస్తూ వస్తున్నాయి. 100 కోట్ల వరకు ఆఫర్ ఇస్తున్నాయని కోలీవుడ్ సమాచారం. ఈ రేటు ఇంకా పెరిగే ఛాన్స్ కూడా వుందని అంటున్నారు. మరి నిర్మాత ఓటీటీకి ఇచ్చేస్తాడా? లేక థియేటర్లు ఓపెన్ అయ్యేవరకు ఎదురుచూస్తారా? అన్నది త్వరలో తేలిపోతుంది!