లండన్‌లో కిడ్నాపైన చెన్నై యువతి.. ప్రేమ పేరుతో మతం మార్చి బంగ్లాదేశ్‌కు తరలింపు!
- ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన యువతి
- విడిచిపెట్టేందుకు కోట్లాది రూపాయల డిమాండ్
- రంగంలోకి జాతీయ దర్యాప్తు సంస్థ
యువకుడు, అతడి తండ్రి, స్నేహితులతోపాటు జకీర్ నాయక్ అనే వ్యక్తి కలిసి ఈ ప్రేమ నాటకానికి తెరతీసినట్టు తెలుస్తోంది. వీరంతా ముంబై పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నట్టు సమాచారం. యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెను విడిచిపెట్టేందుకు కోట్లాది రూపాయలను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. యువతి తండ్రికి ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉండడంతో విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లగలిగాడు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ విచారణను వేగవంతం చేసింది.