ఆ 23 చోట్ల కూడా మీ పేరు చెబితేనే భగ్గుమంటున్నారు: చంద్రబాబుపై సజ్జల విసుర్లు
- అమరావతిపై దొంగ పోల్స్ నిర్వహిస్తున్నారంటూ విమర్శలు
- ఆ ఫలితాలు ఎలావుంటాయో అందరికీ తెలుసని వ్యాఖ్యలు
- కుళ్లు, కుతంత్రాలు విడిచిపెట్టాలంటూ చంద్రబాబుకు హితవు
"రాజకీయ కెరీర్ లో చివరి దశలో ఉన్న మీరు ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఈ పైశాచిక ఎత్తుగడలు మానేయండి, కుళ్లు కుతంత్రాలు విడిచిపెట్టండి. మీ మీడియాతో కల్లబొల్లి కథనాలు వండి వార్చే పద్ధతులు విడనాడండి. విశాఖ, కర్నూలు నగరాలపై ద్వేషాన్ని చిమ్మకండి. అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతు ఇవ్వండి" అంటూ వ్యాఖ్యానించారు.