Kodali Nani: పేదలకు స్థానం లేని అమరావతిలో అసెంబ్లీ కూడా అనవసరం: ఏపీ మంత్రి కొడాలి నాని

There is no use with Amaravathi says Kodali Nani
  • పేదలకు స్థానం లేని అమరావతితో ఏం ప్రయోజనం?
  • డాక్టర్ రమేశ్ ను చంద్రబాబు తన ఇంట్లో దాచారు
  • చంద్రబాబు ట్రాప్ లో హీరో రామ్ పడరాదు
ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు స్థానంలేని రాజధాని అమరావతితో ప్రయోజనం లేదని అన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయమని... ఆ పని ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ప్రజలకు ఉపయోగం లేని అమరావతిలో చట్టాలు చేసే అసెంబ్లీ ఉండటం కూడా అనవసరమేనని అన్నారు.

రమేశ్ ఆసుపత్రి యజమాని డాక్టర్ రమేశ్ ను టీడీపీ అధినేత చంద్రబాబు తన ఇంట్లో దాచారని కొడాలి నాని ఆరోపించారు. తప్పు చేయకపోతే రమేశ్ ఎందుకు పారిపోతారని ప్రశ్నించారు. ఒక మహిళను ముందు పెట్టి పారిపోవడం దారుణమని చెప్పారు. చంద్రబాబు విషయంలో సినీహీరో రామ్ జాగ్రత్తగా ఉండాలని... ఆయన ట్రాప్ లో పడరాదని సూచించారు. ఏ సామాజికవర్గంపై కూడా తమ ప్రభుత్వానికి కక్ష సాధించాల్సిన అవసరం లేదని చెప్పారు.
Kodali Nani
YSRCP
Chandrababu
Actor Ram
Telugudesam
Tollywood

More Telugu News