DK Shiv Kumar: కరోనా బారిన పడిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్!

Karnataka PCC Chief DK Shiv Kumar tested corona positive
  • డీకే శివకుమార్ కు కరోనా పాజిటివ్
  • బెంగళూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • తనను కలిసిన వాళ్లు టెస్టులు చేయించుకోవాలన్న శివకుమార్
కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కరోనా బారినపడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తనతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, కొన్నిరోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలని తెలిపారు.

ప్రస్తుతం డీకే శివకుమార్ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కర్ణాటక రాజకీయ ప్రముఖుల్లో అనేకమంది కరోనా బాధితులయ్యారు. సీఎం యడియూరప్ప సహా మాజీ సీఎం సిద్ధరామయ్య, ఆయన తనయుడు కూడా కరోనా ప్రభావానికి గురయ్యారు. వారే కాదు కొందరు మంత్రులు, శాసనసభ్యులకు సైతం పాజిటివ్ వచ్చింది.
DK Shiv Kumar
Corona Virus
Positive
Bengaluru
Congress
Karnataka

More Telugu News