ఉద్ధానం ప్రాంతవాసుల కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం.. పథకానికి శ్రీకారం: విజయసాయిరెడ్డి
Add ap7am to your home Screen

ఉద్ధానం ప్రాంతవాసుల కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం.. పథకానికి శ్రీకారం: విజయసాయిరెడ్డి

vijaya sai reddy fires on tdp
  • 700 కోట్ల రూపాయలతో రక్షిత మంచి నీటి పథకానికి శ్రీకారం
  • గతంలో నాయకులు అని చెప్పుకునే చాలా మంది వచ్చారు
  • చూశారు, హడావిడి చేసి వెళ్లిపోయారు
  • పరిష్కారానికి ముందడుగు వేసిన ఏకైక నాయకుడు జగన్
నాయకులమని చెప్పుకునే చాలా మంది వచ్చారు, వెళ్లిపోయారని వైఎస్‌ జగన్ మాత్రం అలా కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల ఇబ్బందులు తీర్చుతున్నారని చెప్పారు.  

'ఉద్ధానం ప్రాంత నివాసుల కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం. 700 కోట్ల రూపాయలతో రక్షిత మంచి నీటి పథకానికి శ్రీకారం. నాయకులు అని చెప్పుకునే చాలా మంది వచ్చారు, చూశారు, హడావిడి చేసి వెళ్లిపోయారు. పరిష్కారానికి ముందడుగు వేసిన ఏకైక ప్రజానాయకుడు  ముఖ్యమంత్రి జగన్ గారు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News