Vijayashanti: కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యత ఆయనదే: విజయశాంతి

Vijayasanti Wants Rahul to Take Congress President Post
  • కాంగ్రెస్ లో సమస్యలు పరిష్కారం అవుతాయి
  • పార్టీ ముందడుగు వేస్తుంది
  • ట్విట్టర్ లో విజయశాంతి
కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీయే నాయకత్వం వహించాలని, ఆయన మినహా మరెవరూ పార్టీకి నాయకత్వం వహించలేరని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, సినీ నటి విజయశాంతి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆమె ఓ ట్వీట్ పెట్టారు.

 "శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం చేసిన సేవలు చిరస్మరణీయం. అయితే, పార్టీలో ప్రస్తుత పరిణామాలు త్వరలోనే ఒక కొలిక్కి వచ్చి పరిష్కారమవుతాయని... పటిష్ట నాయకత్వంతో పార్టీ ముందడుగు వేస్తుందని, ఆ బాధ్యత శ్రీ రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని విశ్వసిస్తున్నాను" అని ఆమె అన్నారు.  కాగా, నిన్న జరిగిన కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం, పార్టీ భవిష్యత్ అధ్యక్షుడిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన సంగతి తెలిసిందే.
Vijayashanti
Twitter
Rahul Gandhi
Congress

More Telugu News