కరోనా బారినపడిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్

  • కరోనా బారినపడుతున్న ప్రముఖులు
  • తనకు కరోనా సోకినట్టు వెల్లడించిన ఖట్టర్ 
  • తనను కలిసినవాళ్లు టెస్టులు చేయించుకోవాలని సూచన
సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా ఎవరిపైనా కనికరం చూపడంలేదు. భారత్ లో అనేకమంది రాజకీయ నేతలు కరోనా దెబ్బకు ఆసుపత్రి పాలయ్యారు. మరికొందరు హోమ్ ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

గత వారంరోజులుగా తనను కలిసిన వారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, తనతో సన్నిహితంగా మెలిగినవాళ్లు క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. కాగా, హర్యానా అసెంబ్లీ స్పీకర్ గ్యాన్ చంద్ గుప్తాకు కూడా కరోనా సోకింది. దాంతో ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాను డిప్యూటీ స్పీకర్ నిర్వహించనున్నారు.

Manohar Lal Khattar
Corona Virus
Positive
Haryana
Chief Minister

More Telugu News