Kailasa: నిత్యానంద కైలాస దేశంలో హోటల్ ప్రారంభిస్తా: తమిళనాడు వ్యాపారవేత్త ఉత్సాహం

Madhurai hotel owner interested to start a hotel in Kailasa country which announced by Swami Nithyananda
  • కైలాస దేశాన్ని ప్రకటించిన నిత్యానంద
  • రిజర్వ్ బ్యాంక్ కూడా ఏర్పాటు
  • ఇటీవలే కరెన్సీ నోట్లు, నాణేలు విడుదల
అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద కైలాస పేరుతో ఓ దేశం స్థాపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, రిజర్వ్ బ్యాంకు నెలకొల్పి, కరెన్సీ నోట్లు, నాణేలు కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన కుమార్ అనే వ్యాపారవేత్త కైలాస దేశంలో హోటల్ వ్యాపారం ప్రారంభించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.

మధురైలో టెంపుల్ సిటీ హోటల్ పేరిట వ్యాపారం చేస్తున్న కుమార్ మధురై జిల్లా హోటల్ యజమానుల సంఘానికి అధ్యక్షుడు కూడా. అయితే కైలాస దేశం ఏర్పాటైన నేపథ్యంలో, తనకు ఆ దేశంలో హోటల్ ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలంటూ నిత్యానందకు కుమార్ లేఖ రాశారు. మంచి భోజనం అందిస్తూ అతిథులను ఆకట్టుకోవడమే కాకుండా, దేశాభివృద్ధికి తోడ్పడతానని కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.
Kailasa
Hotel
Kumar
Madhurai
Tamilnadu
Swami Nithananda

More Telugu News