Urvashi Rautela: గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా

Bollywood actress Urvashi Rautela accepts Green India Challenge initiative
  • ఊర్వశి రౌతేలాకు చాలెంజ్ విసిరిన సంపత్ నంది
  • తన నివాసంలో మొక్కలు నాటిన రౌతేలా
  • తన అభిమానులకు చాలెంజ్ విసిరిన బాలీవుడ్ నటి
పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మరింత ఉద్ధృతమైంది. క్రమంగా ఈ ఉద్యమం టాలీవుడ్ ను దాటి ఇతర చిత్ర పరిశ్రమలకు వ్యాపించింది. తాజాగా ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ ను మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా స్వీకరించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు.

అనంతరం తన అభిమానులందరినీ ఈ చాలెంజ్ కు నామినేట్ చేశారు. అంతేకాదు, ప్రభాస్, మహేశ్ బాబు, తమిళ హీరో విజయ్ వంటి అగ్రనటులు పాల్గొన్న గ్రీన్ ఇండియా చాలెంజ్ లో తాను కూడా భాగస్వామి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు, టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది... ఊర్వశి రౌతేలాను ఈ చాలెంజ్ కు నామినేట్ చేశారు.
Urvashi Rautela
Green India Challenge
Sampath Nandi
Saplings
Hyderabad

More Telugu News