అల్లు అర్జున్ 'పుష్ప' షూటింగ్ షెడ్యూల్ అప్ డేట్స్
- సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 'పుష్ప'
- కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్
- నవంబర్ లో షెడ్యూల్ ప్రారంభం
- మహబూబ్ నగర్ అడవుల్లో చిత్రీకరణకు ప్లాన్
ఇక ఈ చిత్రం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో రూపొందుతుండడం వల్ల మహబూబ్ నగర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లో ఎక్కువగా హీరోకి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తారట. ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. మరోపక్క, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం కోసం ఇప్పటికే కొన్ని బాణీలను సిద్ధం చేసేశాడట.