Kangana Ranaut: కంగనా ప్రత్యేక అజెండాతో వెళుతోంది: సుశాంత్ కుటుంబ న్యాయవాది వికాస్ సింగ్

Sushant family lawyer says Kangana Ranaut follows her own agenda
  • సుశాంత్ మరణం తర్వాత రెచ్చిపోయిన కంగనా రనౌత్
  • బాలీవుడ్ లో బంధుప్రీతి ఉందంటూ వ్యాఖ్యలు
  • సుశాంత్ కేసులో బంధుప్రీతికి ప్రాధాన్యత లేదన్న కుటుంబ న్యాయవాది
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాలీవుడ్ లో బంధుప్రీతికే ప్రాధాన్యత ఇస్తారని, బయటి వ్యక్తులను ఎదగనివ్వరని, సుశాంత్ ఈ బంధుప్రీతి రాజకీయాలతో మనస్తాపం చెంది ఉంటాడని కంగనా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, కరణ్ జొహార్ వంటి అగ్రశ్రేణి ఫిలింమేకర్లను కూడా ఆమె టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సుశాంత్ మరణం తర్వాత కంగనా రనౌత్ తన వ్యక్తిగత అజెండాతో ముందుకు పోతోందని, తనను ఇబ్బందులకు గురిచేసిన వారిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తోందని తెలిపారు. బాలీవుడ్ లో బంధుప్రీతి కొత్తకాదని, సుశాంత్ వ్యవహారానికి బంధుప్రీతి అంశానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. బంధుప్రీతి కారణంగా సుశాంత్ కొన్ని ఇబ్బందులు పడి ఉండొచ్చు కానీ, ఈ కేసులో ఆ అంశానికి ప్రాధాన్యత లేదని వివరించారు. కానీ కంగనా తన సొంతదారిలో వెళుతోందని అన్నారు.
Kangana Ranaut
Sushant Singh Rajput
Family Lawyer
Nepotism
Bollywood

More Telugu News