రోహిత్ శర్మ, వినేశ్ ఫోగాట్ లకు ఖేల్ రత్న... తెలుగుతేజం సాయిరాజ్ కు అర్జున అవార్డు
- క్రీడా అవార్డులు ప్రకటించిన కేంద్రం
- మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ కు ఖేల్ రత్న
- ఇషాంత్ శర్మకు అర్జున అవార్డు
ఇక మరో విశిష్ట పురస్కారం అర్జున అవార్డు విజేతల్లో తెలుగుతేజం, బ్యాడ్మింటన్ ఆశాకిరణం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి కూడా ఉన్నాడు. సాత్విక్ సాయిరాజ్ డబుల్స్ లో ప్రపంచస్థాయిలో పదో ర్యాంకులో ఉండడం విశేషం. అర్జున గెలుచుకున్నవారిలో విలువిద్య క్రీడాకారుడు అతాను దాస్, మహిళా అథ్లెట్ ద్యుతీచంద్, క్రికెటర్ ఇషాంత్ శర్మ, మహిళా క్రికెటర్ దీప్తి శర్మ తదితరులు ఉన్నారు.