చంద్రబాబు గారూ, మీరు చేసిన ట్వీట్ నిస్సిగ్గుగా చేసిన దాడి: సంచయిత
- నిన్న మాన్సాస్ ట్రస్టుపై వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
- క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసిన సంచయిత
- లేకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామంటూ ట్వీట్
చంద్రబాబు గారూ, మీరు చేసిన ట్వీట్ నిస్సిగ్గుగా చేసిన దాడి అంటూ పేర్కొన్నారు. మాన్సాస్ లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించాలనుకోవడం బాధ్యతారాహిత్యం అని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం జీతాలు చెల్లించినట్టు ఈవో, కరస్పాండెంట్లు వివరించారని, అయినాగానీ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని సంచయిత ఆగ్రహం వ్యక్తం చేశారు.