KCR: శ్రీశైలం ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

KCR monitoring Srisailam power house fire accident
  • నిన్న రాత్రి 10.30 గంటలకు అగ్ని ప్రమాదం
  • ఆ సమయంలో అక్కడ 17 మంది ఉద్యోగులు
  • సురక్షితంగా బయటపడ్డ 8 మంది
శ్రీశైలం విద్యుదుత్పత్తి కేంద్రంలో ప్రమాదం సంభవించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. నిన్న రాత్రి 10.30 గంటల సమయంలో శ్రీశైలం కుడి కాలువ విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. విద్యుత్ కేంద్రాన్ని దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

ఆ సమయంలో అక్కడ 17 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనగుతున్నాయి. ఈ ఘటనపై కేసీఆర్ స్పందిస్తూ, ప్రమాద స్థలిలో ఉన్న ప్రతి ఒక్కరూ తిరిగి రావాలని కోరుకున్నారు. ప్లాంట్ వద్ద ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డితో ఆయన మాట్లాడారు.
KCR
TRS
Srisailam
Fire Accident

More Telugu News