తన తోబుట్టువులతో కలిసివున్న ఫొటోను పంచుకున్న కంగనా రనౌత్
- ఈ ఫొటో 1998 నాటిదన్న కంగనా
- నవంబరులో తన సోదరుల పెళ్లిళ్లు జరిగాయని వెల్లడి
- ఈ క్షణాలను ఇన్ని సంవత్సరాలు ఎలా కోల్పోయామంటూ ట్వీట్
"ఈ ఫొటోలో నా పక్కనే నిల్చున్న నా తమ్ముళ్ల పేర్లు అక్షత్, కరణ్. ఇటీవలే నవంబరులో వాళ్ల పెళ్లిళ్లు జరిగాయి. అంత ఉద్విగ్న క్షణాలను మా కుటుంబంలో ఎప్పుడూ చూడలేదు. ఇన్ని సంవత్సరాలు ఈ క్షణాలను ఎలా కోల్పోయామో తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతోంది" అంటూ కంగనా ట్వీట్ చేశారు. కాగా, ఈ ఫొటోలో కంగనా అక్క రంగోలీ చందేల్ కూడా ఉన్నారు.