ఏపీలో మరో 95 మంది మృత్యువాత... 3 వేలు దాటిన కరోనా మరణాలు

  • గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 16 మంది మృతి
  • రాష్ట్రవ్యాప్తంగా 9,393 మందికి కరోనా పాజిటివ్
  • 8,846 మందికి కరోనా నయం
ఏపీలో కరోనా విలయం అడ్డు అదుపు లేకుండా సాగిపోతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 95 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 16 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది మరణించారు. ఈ క్రమంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,001కి పెరిగింది. కొత్తగా 9,393 మందికి కరోనా నిర్ధారణ కాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,396కి చేరింది. తాజాగా 8,846 మంది కోలుకున్నారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు 2,35,218 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 87,177 మంది చికిత్స పొందుతున్నారు.

Andhra Pradesh
Corona Virus
Deat Toll
Positive Cases
COVID-19

More Telugu News