Somu Veerraju: అభివృద్ధి అనేది కేవలం బీజేపీ వల్లనే: సోము వీర్రాజు

AP BJP President Somu Veerraju visits Srikakulam district
  • శ్రీకాకుళం జిల్లాలో సోము వీర్రాజు పర్యటన
  • ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
  • అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరువ చేయాలన్న సోము
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. దీనిపై సోము వీర్రాజు ట్విట్టర్ లో స్పందించారు. అభివృద్ధి అనేది కేవలం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వల్లనే సాధ్యం అనే విషయాన్ని సామాన్య ప్రజలందరూ తెలుసుకునే విధంగా పార్టీ శ్రేణులు వివిధ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్బోధించారు.

కేంద్రం అందిస్తున్న అభివృద్ధి ఫలాలను ప్రతి సామాన్యుడి వరకు చేరేలా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన నూతన విద్యావిధానం గురించి ప్రస్తావిస్తూ, నాడు వాజ్ పేయి సర్వ శిక్ష అభియాన్ తో విద్యావిధానంలో పెను మార్పులు సృష్టించారని, నేడు మోదీ నూతన విద్యావ్యవస్థతో భావితరాలకు బంగారు బాట వేస్తున్నారని కీర్తించారు.
Somu Veerraju
Srikakulam District
BJP
Andhra Pradesh

More Telugu News