భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న నీటిమట్టం... అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం
- గత రాత్రి 43 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం
- ఈ ఉదయానికి 45.8 అడుగులకు చేరిక
- ఈ రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం
ఇప్పటికే కేంద్రం జిల్లా కలెక్టర్ ను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలకు సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ రాత్రికి వరద నీరు పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. వరద పోటెత్తుతున్న నేపథ్యంలో భద్రాచలం నుంచి హైదరాబాదు, ఖమ్మం తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు.