మాజీ క్రికెటర్, క్యురేటర్ కస్తూరి రంగన్ కన్నుమూత
- ఒకప్పటి మైసూరు రాష్ట్రానికి ప్రాతినిధ్యం
- బీసీసీఐ క్యురేటర్‌గా, బోర్డు అధికార ప్రతినిధిగా సేవలు
- కస్తూరిరంగన్ మృతికి అనిల్ కుంబ్లే సంతాపం
1952లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా భారత జాతీయ జట్టుకు ఎంపికైనప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లలేకపోయారు. కర్ణాటక జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించిన కస్తూరి రంగన్ కర్ణాటక క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడిగా, బీసీసీఐ క్యురేటర్‌గా, బోర్డు అధికార ప్రతినిధిగా సేవలందించారు. కస్తూరిరంగన్ మృతికి టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే విచారం వ్యక్తం చేశాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశాడు.