Nivetha Thomas: నాగ్ అశ్విన్ సినిమాలో కీలక పాత్రలో నివేద థామస్

Nivetha Thomas in Prabhas movie
షార్ట్స్‌లో చూడండి
మలయాళీ భామ నివేద థామస్ లో చక్కని అందం, అభినయం ఉన్నప్పటికీ, తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. అప్పుడప్పుడు ఒకటీ అరా సినిమాలలో నటించే ఛాన్సులే అమ్మడికి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ నటించే ఓ భారీ చిత్రంలో నివేదకు అవకాశం వచ్చినట్టు సమాచారం.

'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ రూపొందనుంది. వైజయంతీ మూవీస్ నిర్మించే ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ భామ దీపిక పదుకొణే కథానాయికగా నటించనుంది. ఇక ఇందులో ఓ కీలక పాత్రకు తాజాగా నివేద థామస్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ఇది ప్రభాస్ కు 21వ చిత్రం అవుతుంది.

ఇదిలావుంచితే, ప్రభాస్ ప్రస్తుతం 'రాధే శ్యామ్' చిత్రంలో నటిస్తున్నాడు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. మరోపక్క, తన 22వ చిత్రంగా 'ఆదిపురుష్'ను ప్రభాస్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Nivetha Thomas
Prabhas
Deepika Padukone
Nag Ashwin

More Telugu News