SP Balasubrahmanyam: విషమంగానే ఎస్పీ బాలు ఆరోగ్యం.. తాజా హెల్త్ బులెటిన్ విడుదల!

SP Balasubrahmanyam health condition still critical
  •  చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స 
  • ఐసీయూలో లైఫ్ సపోర్ట్ మీద గానగంధర్వుడు
  • పర్యవేక్షిస్తున్న ఎక్స్ పర్ట్ మెడికల్ టీమ్
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆసుపత్రి వైద్యులు బాలు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 'కరోనాతో ఎంజీఎం హెల్త్ కేర్ లో చేరిన బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఐసీయూలో లైఫ్ సపోర్ట్ మీద ఉన్నారు. ఒక ఎక్స్ పర్ట్ మెడికల్ టీమ్ ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది' అని బులెటిన్ లో పేర్కొన్నారు.
SP Balasubrahmanyam
Corona Virus
Health
Tollywood

More Telugu News