Chiranjeevi: నేను తీసిన మొదటి ఫొటో ఇదే.. ఇందులో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు: చిరంజీవి

Chiranjeevi shares first photo shot by him
  • ఇటీవలే సోషల్ మీడియాలో ప్రవేశించిన చిరంజీవి
  • అనేక విషయాలను పంచుకుంటున్న మెగాస్టార్
  • తాజాగా ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేసిన చిరు
ఇటీవలే సోషల్ మీడియాలో ప్రవేశించిన చిరంజీవి... రెగ్యులర్ గా తన అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. అనేక విషయాలను పంచుకుంటున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. ఇటీవలే ఒక వంటతో కూడా సోషల్ మీడియాను షేక్ చేశారు. తాజాగా ఒక ఫొటోను ఆయన షేర్ చేశారు. 'నేను తీసిన మొదటి ఫొటో... ఇందులో ఐదుగురు ఉన్నారు. వీరిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు.. చెప్పుకోండి చూద్దాం' అని అభిమానులను ప్రశ్నించారు.

ఈనెల 22న చిరంజీవి పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరు తాజా చిత్రం 'ఆచార్య' ఫస్ట్ లుక్... అలాగే మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు.
Chiranjeevi
Pawan Kalyan
Janasena
Tollywood

More Telugu News