YSR Housing Scheme: వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ మోడల్ హౌస్ ను పరిశీలించిన జగన్

Jagan inspects YSR Housing model house
  • తాడేపల్లి వద్ద మోడల్ హౌస్ నిర్మాణం
  • 40 గజాల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం
  • ఇంటి నిర్మాణానికి అయిన ఖర్చు రూ. 2.50 లక్షలు
వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ కింద ప్రభుత్వం ఇళ్లను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాడేపల్లి బోట్ హౌస్ వద్ద గృహ నిర్మాణ శాఖ మోడల్ హౌస్ ను నిర్మించింది. సెంటు స్థలంలో తక్కువ ఖర్చుతోనే ఎక్కువ నాణ్యతతో కూడిన ఇంటిని నిర్మించింది. 40 గజాల విస్తీర్ణంలో కిచెన్, బెడ్ రూమ్, హాల్, వరండాలతో కూడిన ఇంటిని నిర్మించారు. ఈ నిర్మాణానికి రూ. 2.50 లక్షల ఖర్చు అయింది. ఈ మోడల్ హౌస్ ను ఈరోజు ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటికి సంబంధించిన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఇంటి నిర్మాణం బాగుందని జగన్ సంతృప్తిని వ్యక్తం చేశారు.
YSR Housing Scheme
Model House
Jagan

More Telugu News