Nellore District: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ‘కనులు కనులను దోచాయంటే’ నిర్మాత దుర్మరణం

Kanulu Kanulanu Dochaayante producer died in a road accident at Nalgonda dists
  • అనారోగ్యంతో ఉన్న తండ్రితో కలిసి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు
  • నల్గొండ జిల్లా కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన అంబులెన్స్
  • అక్కడికక్కడే మృతి చెందిన తండ్రీకొడుకులు
నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్‌ నిర్మాత దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లాకు చెందిన గుండాల కమలాకర్‌రెడ్డి, నందగోపాల్‌రెడ్డి (75) తండ్రీకుమారులు. నందగోపాల్‌రెడ్డి గతంలో ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాను మరొకరితో కలిసి నిర్మించారు. ఇటీవల అనారోగ్యం బారినపడిన నందగోపాల్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చూపించేందుకు కుమారుడు కమలాకర్‌రెడ్డి అంబులెన్స్‌లో బయలుదేరాడు.

ఈ క్రమంలో నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అంబులెన్స్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Nellore District
Kanulu Kanulanu Dhochaayante
Producer
Road Accident
died

More Telugu News