Andhra Pradesh: ఏపీలో 3 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు 

Andhra Pradesh crosses three lakh corona positive cases
  • కొత్తగా 9,652 కేసులు వెల్లడి
  • రాష్ట్రవ్యాప్తంగా 88 మంది మృత్యువాత
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది బలి

ఏపీలో కరోనా రక్కసి ప్రభావం తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,261కి పెరిగింది. కొత్తగా 9,652 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,396 మందికి పాజిటివ్ అని తేలింది.

అటు మరణాల సంఖ్య ఆందోళనకర రీతిలోనే ఉంది. తాజాగా 88 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది కరోనాతో కన్నుమూశారు. మొత్తమ్మీద రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,820కి పెరిగింది. గత 24 గంటల్లో 9,211 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85,130 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,18,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

  • Loading...

More Telugu News