Vijay Sai Reddy: ఇజ్రాయిల్ ట్యాపింగ్ మిషన్ల కోసం కింద మీదా పడ్డట్టు వికీలీక్స్ బయట పెట్టింది కదా?: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy Comments on Chandrababu Phone Tapping Remarks
  • టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారన్న చంద్రబాబు
  • ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన బాబు
  • ట్విట్టర్ లో ఎద్దేవా చేసిన విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నదని ఆరోపిస్తూ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడాన్ని, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ మెషీన్ల వ్యవహారాన్ని వికీలీక్స్ బయట పెట్టిందని గుర్తుచేశారు.

"మనవాళ్లు బ్రీఫుడు మీ’ అన్న వాయిస్ మీదేనని పసిపిల్లలూ గుర్తుపట్టారు. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఎవరిచ్చారని మీడియా ఇంటర్వ్యూల్లో గద్దించిన సంగతి ఎవరూ మర్చి పోలేదు. ఇజ్రాయిల్ ట్యాపింగ్ మిషన్ల కోసం కింద మీదా పడ్డట్టు వికీలీక్స్ బయట పెట్టింది. దొంగే దొంగని అర్చినట్టు లేదూ?" అని వ్యాఖ్యానించారు.
Vijay Sai Reddy
Twitter
Phone Tapping
Telugudesam
Chandrababu

More Telugu News