Mansas Trust: మాన్సాస్ ట్రస్టుపై విజయసాయి కన్ను పడింది: అయ్యన్నపాత్రుడు

Vijayasai Reddy targeted Mansas Trust says Ayyanna Patrudu
  • విశాఖపై కపట ప్రేమను చూపిస్తున్నారు
  • విశాఖను రియలెస్టేట్ అడ్డాగా మార్చుకున్నారు
  • నగరంలో కబ్జాలు, భూదందాలు ప్రారంభమయ్యాయి
వైసీపీ నేతలకు విశాఖ ప్రజలపై ప్రేమ లేదని... కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఇక్కడి భూమిపై మాత్రమే వారికి ప్రేమ ఉందని అన్నారు. గజపతిరాజులకు చెందిన రూ. 50 వేల కోట్ల విలువైన మాన్సాస్ ట్రస్టుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కన్ను పడిందని ఆరోపించారు.

విశాఖలో కబ్జాలు, భూదందాలు ప్రారంభమయ్యాయని అన్నారు. విశాఖను రియలెస్టేట్ దందాకు అడ్డాగా విజయసాయి మార్చుకున్నారని చెప్పారు. భూదందాలో పట్టుబడినవారు తన మనుషులు కాదని విజయసాయి ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే నవ్వొస్తోందని అన్నారు. పట్టుబడకుండా దందా చేస్తున్నవాళ్లు మాత్రమే మీవాళ్లా విజయసాయిగారు అని ప్రశ్నించారు.

వైయస్ విజయమ్మను ఓడించినందుకే హుదూద్ తుపానుతో దేవుడు శిక్షను విధించాడనడంతో తమ రాక్షస మనస్తత్వాన్ని బయటపెట్టుకున్న వైసీపీ నేతలు.. ఇప్పుడు విశాఖపై లేని ప్రేమను ఒలకపోస్తున్నారని విమర్శించారు.
Mansas Trust
Vijayasai Reddy
YSRCP
Ayyanna Patrudu
Telugudesam

More Telugu News