Vijay Sai Reddy: కరోనాకు భయపడి బాబు తన ఇంటికి పార్టీ సీనియర్ నాయకులను కూడా రానివ్వడంలేదు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy once again criticizes in his own style
  • జూమ్ బాబు అంటూ వ్యాఖ్యలు
  • నాయకుడంటే ముందుండి నడపాలంటూ ట్వీట్
  • ఇంట్లో కూర్చుని జూమ్ ద్వారా కాదంటూ విమర్శలు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా జూమ్ బాబు అంటూ విజయసాయి ట్విట్టర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మాత్రం హైదరాబాదులో ఇంటి పట్టునే ఉంటూ అమరావతి కోసం రోడ్డెక్కండని ప్రజలకు చెబుతున్నాడని ట్వీట్ చేశారు. కరోనాకు భయపడి తన నివాసానికి పార్టీ సీనియర్ నాయకులను కూడా రానివ్వడంలేదని తెలిపారు. నాయకుడు అంటే ముందుండి నడపాలి బాబూ... ఇంట్లో కూర్చుని జూమ్ ద్వారా కాదు అంటూ హితవు పలికారు.
Vijay Sai Reddy
Chandrababu
Corona Virus
Telugudesam
Zoom App

More Telugu News