Mystery Woman: సుశాంత్ రాజ్ పుత్ నివాసంలో మిస్టరీ యువతి ఎవరో చెప్పిన పోలీసులు!

mystery woman at Sushant house as police sources revealed her identity
  • జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య
  • ఆ తర్వాత సుశాంత్ నివాసానికి వచ్చిన యువతి
  • వీడియోలు వైరల్
రెండు నెలల కిందట ముంబయిలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోగా, ఆ ఘటన తాలూకు ప్రకంపనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే, సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న జూన్ 14న ఓ యువతి ముఖానికి మాస్కుతో సుశాంత్ నివాసం వద్దకు వచ్చినట్టు కొన్ని వీడియోల్లో వెల్లడైంది. ఆ యువతి ఎవరన్నది తొలుత మిస్టరీగా మారింది. ఆమెకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, ఆ యువతి ఎవరో ముంబయి పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఆమె పేరు జమీలా అని, ఆమె నటి రియా చక్రవర్తి సోదరుడు షోయిక్ గాళ్ ఫ్రెండ్ అని వివరించాయి. జమీలా... సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త విని అతని నివాసానికి ప్రియాంక ఖేమాని, మహేశ్ శెట్టి అనే ఇతర స్నేహితులతో కలిసి వచ్చిందని, కానీ పోలీసులు అనుమతించకపోవడంతో సుశాంత్ ఇంటి పనివాళ్లతో మాట్లాడి తిరిగి వెళ్లిపోయిందని చెప్పారు. కాగా, ఇన్ స్టాగ్రామ్ లో సుశాంత్ తన ఇతర స్నేహితులతో కలిసివున్న ఫొటోలో జమీలా కూడా ఉంది.
Mystery Woman
Zameela
Sushant House
Mumbai
Suicide

More Telugu News