Caste: కులం అనే జబ్బు కరోనా కంటే చాలా డేంజరస్: సినీ హీరో రామ్

Actor Ram Pothineni says Caste in dangerous than Corona
  • కులం అనే జబ్బు కరోనా వైరస్ కంటే వేగంగా విస్తరిస్తుంది 
  • దీని బారిన ఎవరూ పడొద్దు
  • ఎవరైనా లాగాలని ప్రయత్నించినా.. దీని ఉచ్చులోకి పడొద్దు

విజయవాడలోని స్వర్ణ ప్యాలస్ లో రమేశ్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న తర్వాత పలు పరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ అంశంపై సినీ హీరో రామ్ పోతినేని కూడా స్పందించాడు.

స్వర్ణప్యాలెస్ లో ప్రభుత్వం కూడా క్వారంటైన్ సెంటర్ ను నిర్వహించిందని చెప్పాడు. సీఎం జగన్ కింద పని చేస్తున్న కొందరు ఆయనకు తెలియకుండా చేస్తున్న పనుల వల్ల ఆయన రెప్యూటేషన్ కు డ్యామేజ్ కలుగుతుందని ట్వీట్ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో రామ్ పై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రామ్ ట్విట్టర్ ద్వారా మరోసారి స్పందించాడు. 'సోదర సోదరీమణులారా...  కులం అనే జబ్బు కరోనా వైరస్ కంటే వేగంగా విస్తరిస్తుంది. అది కరోనా కంటే భయంకరమైనది. సైలెంట్ గా విస్తరించే దీని బారిన పడకండి. ఇందులోకి లాగాలని ఎవరైనా ప్రయత్నించినా... దీని ఉచ్చులోకి పడొద్దు' అని ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News