Tamil Nadu: తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్.. ఎన్నికల బరిలోకి సినీ హీరో విజయ్?

Tamil Actor Vijay Ready to fry in coming assembly elections
  • సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్తలు
  • సొంత పార్టీ పేరు నమోదు కోసం విజయ్ తండ్రి సన్నాహాలు
  • ప్రముఖ న్యాయవాదితో సంప్రదింపులు?
తమిళ యువ నటుడు దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడా?.. తమిళనాడు రాజకీయాలతోపాటు, కోలీవుడ్‌లోనూ ఇప్పుడు ఇది ఎడతెగని చర్చగా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయబోతున్నాడంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా అయితే ఈ వార్తలతో హోరెత్తిపోతోంది.

ఏ పార్టీ తరపునో కాకుండా సొంత పార్టీ నెలకొల్పి పోటీ చేయబోతున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ ఇప్పటికే రంగంలోకి దిగారని, కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద తమ పార్టీ పేరును నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. అంతేకాదు, ఇందుకోసం ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాదితో టచ్‌లో ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో విజయ్ నుంచి కానీ, ఆయన తండ్రి నుంచి కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.
Tamil Nadu
Actor Vijay
Politics
Election commission
Kollywood

More Telugu News