జో బిడెన్, కమలా హారిస్‌పై ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
- వారిద్దరూ ఎన్నికైతే పోలీస్ స్టేషన్లను తగ్గించేస్తారు
- నల్లజాతీయురాలు అమెరికన్ల అవసరాలు తీర్చలేదు
- కమల కంటే నాకే ఎక్కువ మంది భారతీయులు తెలుసు
‘‘బిడెన్ అధ్యక్షుడైతే వెంటనే అమెరికాలోని ప్రతి పోలీసు విభాగాన్ని తగ్గించే చట్టాలను ఆమోదిస్తాడు. ఆమె (కమల) అతడి కంటే మరింత అధ్వానంగా ప్రవర్తిస్తారు. నిజానికి కమలా హారిస్ కంటే నాకే ఎక్కువమంది భారతీయులు తెలుసు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఓ నల్లజాతి మహిళ అమెరికన్ల అవసరాలు తీర్చలేదన్నారు. కమల అమెరికాలో జన్మించలేదు కాబట్టి, ఆమెకు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యే అర్హత లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.