Botsa Satyanarayana: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి కన్నుమూత

Minister Botsa Satyanarayana mother passes away
  • గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈశ్వరమ్మ
  • విశాఖపట్టణంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన వైనం
  • నేటి మధ్యాహ్నం విజయనగరంలో అంత్యక్రియలు
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. విశాఖపట్టణంలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వరమ్మకు మొత్తం 11 మంది సంతానం. వీరిలో ఏడుగురు కుమారులు కాగా, నలుగురు కుమార్తెలు. మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు అప్పల నరసయ్య ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయనగరంలో నేటి మధ్యాహ్నం ఈశ్వరమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Botsa Satyanarayana
Mother
Eshwaramma
vizianagaram

More Telugu News