రెండు దశాబ్దాల కల నెరవేరిన వేళ.. ఇంటి మేడపై విమాన తయారీ!

Man who built plane on terrace got success
  • భారత్‌లోనే విమానాన్ని తయారు చేయాలని లక్ష్యం
  • తొలి దశలో విజయవంతంగా గగన విహారం
  • రెండో దశ కోసం రెడీ అవుతున్న మహారాష్ట్ర ‘కెప్టెన్’
మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా తన ఇంటిపైనే విమానాన్ని తయారుచేశాడు. అంతేకాదు.. దానితో విజయవంతంగా ఆకాశంలో చక్కర్లు కూడా కొట్టాడు. రెండు దశాబ్దాల ఆయన కల సాకారం కావడంతో పట్టలేని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. పూర్తిగా భారత్‌లో ఓ విమానాన్ని తయారుచేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రానికి చెందిన కెప్టెన్ అమోల్ యాదవ్ చేపట్టిన విమాన తయారీ ఎట్టకేలకు సత్ఫలితాలు ఇచ్చింది.  

విమానం తొలి దశ పరీక్షలకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) గతేడాదే అనుమతి ఇచ్చింది. దీంతో తాజాగా ఓ టెక్నీషియన్ సాయంతో విమానానికి తొలి దశ పరీక్షలు నిర్వహించారు. రెండో దశ ప్రయోగంలో 2 వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరి పరీక్షిస్తామని అమోల్ యాదవ్ తెలిపారు. విమాన పరీక్షల కోసం భారీగా బీమా చేయాల్సి ఉంటుందని, కాబట్టి కుటుంబ సభ్యుల సహకారంతో నిధులు సమకూర్చుతున్నట్టు పేర్కొన్నారు.
Go Back to Shorts
flight
Maharashtra
terrace
DGCA

More Telugu News