Jagan: కంగ్రాచ్యులేషన్స్ ధోనీ... నీ ఘనత తరతరాలకు స్ఫూర్తిదాయకం: సీఎం జగన్

CM Jagan congrats MS Dhoni on his retirement from International cricket
  • రిటైర్మెంటు ప్రకటించిన ధోనీ
  • మహోజ్వలమైన కెరీర్ అంటూ అభినందనలు
  • భవిష్యత్తులో విజయవంతం కావాలంటూ ట్వీట్
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు కొద్దిసేపటి క్రితమే ప్రకటించాడు. ధోనీ రిటైర్మెంటు నిర్ణయం ఇప్పటికిప్పుడు ప్రకటిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ స్పందించారు.

 కంగ్రాచ్యులేషన్స్ ధోనీ అంటూ ఈ ఝార్ఖండ్ డైనమైట్ ను అభినందించారు. మహోజ్వలమైన కెరీర్ ను సొంతం చేసుకున్నావంటూ ప్రశంసించారు. నువ్వు సాధించిన ప్రాభవం తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఔత్సాహికులకు ధోనీ ఘనతలు ప్రేరణ కలిగిస్తాయని వివరించారు. ధోనీ భవిష్యత్ ప్రణాళికలు విజయవంతం కావాలని అభిలషిస్తున్నట్టు సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Jagan
MS Dhoni
Cricket
Retirement
International Cricket
Team India

More Telugu News