SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భార్యకు కూడా కరోనా పాజిటివ్

SP Balasubrahmanyam wife Savithri tests with Corona positive
  • బాలు భార్య సావిత్రి ఆసుపత్రికి తరలింపు
  • ఈనెల 5న బాలుకు కరోనా నిర్ధారణ
  • ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న బాలు ఆరోగ్యం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి కోలుకుంటున్నారనే వార్తతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఇంతలోనే మరో ఆందోళనకర వార్త వెలుగులోకి వచ్చింది. బాలు భార్య సావిత్రికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈనెల 5వ తేదీన బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో, ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకి తరలించారు. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ఎంజీఎం వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, నాన్న ఆరోగ్యం కుదుటపడుతోందని, ఆయన కోలుకుంటున్నారని బాలు కుమారుడు చరణ్ ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బాలు భార్య కూడా కరోనా బారిన పడ్డారనే వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి.
SP Balasubrahmanyam
Wife
Savithri
Corona Virus
Positive
Tollywood

More Telugu News