Hero Ram: అందరినీ ఫూల్స్ చేయడానికే ఈ విషయాన్ని ఫైర్ నుంచి ఫీజువైపు మళ్లిస్తున్నారా?: హీరో రామ్

Hero Ram comments on Swarna Palace fire accident issue
  • జగన్ వెనుక కుట్ర జరుగుతోందన్న రామ్  
  • తాజాగా స్వర్ణప్యాలెస్ ఘటనపై వ్యాఖ్యలు
  • ఫైర్+ఫీజు=ఫూల్స్ అంటూ ట్వీట్
ఇటీవల విజయవాడలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంపై టాలీవుడ్ యువ హీరో రామ్ స్పందించారు. ఆయన ఇవాళ సీఎం జగన్ వెనుక కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు కొనసాగింపుగా తాజా ట్వీట్లు చేశారు. హోటల్ స్వర్ణ ప్యాలెస్ ను రమేశ్ హాస్పిటల్స్ యాజమాన్యం కొవిడ్ కేర్ సెంటర్ గా తీసుకోకముందు, అందులో ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్ నిర్వహించిందని రామ్ వెల్లడించారు. అప్పుడు గనుక అగ్నిప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించేవాళ్లని ప్రశ్నించారు.

ఫైర్ ప్లస్ ఫీజు =ఫూల్స్ అంటూ మరో ట్వీట్ చేశారు. అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారా? అంటూ సందేహం వెలిబుచ్చారు. మేనేజ్ మెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసిందని రామ్ తెలిపారు. ఈ సందర్భంగా బిల్లులకు సంబంధించిన కొన్ని రసీదులను కూడా రామ్ ట్విట్టర్ లో పంచుకున్నారు.

Hero Ram
Swarna Palace Hotel
Vijayawada
Covid Care Center

More Telugu News