Kangana Ranaut: బీజేపీ ఆఫర్ ను తిరస్కరించా: కంగనా రనౌత్

Kangana Ranaut reveals that she got an offer from BJP after Manikarnika movie
  • 'మణికర్ణిక' తర్వాత నాకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది
  • నాకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు
  • నా ఆలోచనలన్నీ సినిమాల పైనే
ఒక ఫైర్ బ్రాండ్ గా, తనకు నచ్చకపోతే ఎంతటి వ్యక్తినైనా నిలదీసే మహిళగా బాలీవుడ్ లో కంగనా రనౌత్ కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండానే బాలీవుడ్ లో అగ్రస్థాయికి చేరి సత్తా చాటిందామె. ఆ తర్వాత దర్శకురాలిగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను నిరూపించుకుంది.

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజంపై ఆమె చేసిన వ్యాఖ్యలు, కొందరు బాలీవుడ్ ప్రముఖులపై నేరుగా ఆమె చేసిన కామెంట్లు కలకలం రేపాయి. దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. అయితే, బీజేపీలో చేరేందుకు కంగన ప్రయత్నిస్తోందని... అందుకే మోదీకి మద్దతిచ్చేలా ఆమె వ్యవహరిస్తోందంటూ ఒక వర్గం ఆమెపై ఆరోపణలు చేస్తోంది.

ఈ అంశంపై కంగన స్పందిస్తూ, 'మణికర్ణిక' సినిమా తర్వాత టికెట్ ఇస్తామంటూ బీజేపీ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని తెలిపింది. అయితే, తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేకపోవడంతో.. బీజేపీ ఆఫర్ ను తిరస్కరించానని చెప్పింది. తనకు రాజకీయాలపై ఆలోచన లేదని... తన ఆలోచనలన్నీ సినిమాలపైనే ఉంటాయని తెలిపింది.
Kangana Ranaut
Bollywood
BJP
Narendra Modi

More Telugu News