KTR: 'కేటీఆర్ ను సీఎం చేయండి'... టీఆర్ఎస్ లో ఊపందుకుంటున్న డిమాండ్లు!

TRS MLA Shakeel demands to make KTR as CM
  • ఇప్పటికే పార్టీ బాధ్యతలను చూసుకుంటున్న కేటీఆర్
  • కేటీఆర్ ను సీఎం చేయాలంటున్న పార్టీ నేతలు
  • అన్ని అర్హతలు కేటీఆర్ కు ఉన్నాయన్న ఎమ్మెల్యే షకీల్
ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ బాధ్యతలన్నింటినీ కేటీఆర్ చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు పాలనా వ్యవహారాలకే పరిమితమయ్యారు. పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి.

 ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ కూడా కేటీఆర్ అధ్యక్షతన జరగడం అందరి దృష్టిని ఆకర్షించింది. పార్టీలో ఏదో జరగబోతోందనే అనుమానాలు మరింత బలపడ్డాయి. కేటీఆర్ కు పాలన పగ్గాలను అందించేందుకు అడుగులు పడుతున్నాయనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా కేటీఆర్ ను సీఎం చేయాలనే డిమాండ్లు పార్టీలో వినిపిస్తున్నాయి.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. డైనమిక్ లీడర్ కేటీఆర్ ను సీఎం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి కావాల్సిన అన్ని అర్హతలు కేటీఆర్ కు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది.
KTR
TRS
KCT
CM
Demands

More Telugu News