L Ramana: కేసీఆర్ కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా?: టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ

L Ramana doubts about KCRs health
  • కేటీఆర్ కేబినెట్ సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారు?
  • కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైంది
  • 17వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడతాం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బతికుండగానే... ఆయన లేకుండా సహచర మంత్రులతో కేటీఆర్ కేబినెట్ సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని అడిగారు.

 కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని... కరోనా బాధితులకు న్యాయం చేసేంత వరకు ప్రభుత్వంపై అఖిలపక్షం పోరాడుతుంటుందని చెప్పారు. కరోనాపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈనెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. హైదరాబాదులోని టీజేఎస్ కార్యాలయంలో నేడు విపక్షాలు సమావేశమయ్యాయి. ఈ సందర్బంగా మీడియాతో ఎల్.రమణ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News