నాడు కమలా హారిస్ ప్రచారానికి వేల డాలర్లు విరాళమిచ్చిన డొనాల్డ్ ట్రంప్!
- రాజకీయాల్లోకి రాకముందు విరాళాలు
- 2011 నుంచి 2014 వరకూ హారిస్ కు నిధులు
- ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చిన ట్రంప్
ఇక, 2015లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి రిపబ్లికన్ల మద్దతు కూడగట్టుకుంటున్న వేళ, గతంలో ఆయన ఇచ్చిన డొనేషన్లను చారిటీ సంస్థలకు తాను ఇచ్చేశానని కమలా హారిస్ స్వయంగా తెలిపారు. 2011 నుంచి 2016 వరకూ కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా కమలా హారిస్ పనిచేశారన్న సంగతి తెలిసిందే. ఆపై 2016లో ఆమె సెనేట్ కు ఎన్నికయ్యారు.