Akshay Kumar: ప్రపంచంలోనే అత్యధిక సంపన్న నటుల జాబితా.. రూ.363 కోట్ల ఆదాయంతో ఆరో స్థానంలో అక్షయ్ కుమార్

Akshay Kumar only Bollywood star among Forbes highest paid actors list
  • గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు దిగజారిన అక్షయ్
  • సినిమాల ద్వారా కంటే ప్రకటనల ద్వారానే ఎక్కువ ఆదాయం
  • 87.5 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో డ్వేన్ జాన్సన్
ప్రపంచంలోనే అత్యధిక సంపన్న నటుల జాబితాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఆరో స్థానంలో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్-10 నటుల జాబితాను ఈ ఏడాదికి గాను ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసింది.

ఈ జాబితాలో భారత్ నుంచి ఒక్క అక్షయ్ కుమార్‌కు మాత్రమే చోటు దక్కడం విశేషం. గతేడాది నాలుగో స్థానంలో ఉన్న అక్షయ్.. ఈసారి రెండు స్థానాలు దిగజారాడు. 48.5 మిలియన్ డాలర్ల (రూ. 363 కోట్లు) ఆదాయంతో ఆరో స్థానంలో నిలిచాడు. అక్షయ్ కుమార్ సినిమాల ద్వారా కంటే ప్రకటనల ద్వారానే ఎక్కువ ఆర్జిస్తున్నట్టు ఫోర్బ్స్ పేర్కొంది. అమెజాన్ ప్రైమ్ సిరీస్ ‘ది ఎండ్ షో’లో నటిస్తున్న అక్షయ్ 10 మిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది.

ఈ జాబితాలో గతేడాది మొదటి స్థానంలో నిలిచిన హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ ఈసారి కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 87.5 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. డెడ్‌పూల్ స్టార్ అయిన ర్యాన్ రెనాల్డ్ 71.5 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మార్క్ వాల్బర్గ్, బెన్ అఫ్లెక్, విన్ డీజిల్ నిలిచారు.
Akshay Kumar
Bollywood
Forbes list

More Telugu News