Chandrababu: పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనాతో కన్నుమూయడం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

Chandrababu and Lokesh saddened to the demise of Palem Srikanth Reddy
  • కరోనాతో శ్రీకాంత్ రెడ్డి మృతి
  • ఎలాంటి కల్మషంలేని వ్యక్తి అంటూ ట్వీట్
  • ఆత్మీయుడ్ని కోల్పోయామన్న బాబు
ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనా మహమ్మారికి బలయ్యారన్న వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. పాలెం శ్రీకాంత్ రెడ్డి ఎలాంటి కల్మషం లేని వ్యక్తి అని, సహృదయుడని కీర్తించారు. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రజలకు సేవలు అందించేందుకు తపించిన శ్రీకాంత్ రెడ్డి నిజమైన నాయకుడని కొనియాడారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి, మిత్రులకు సానుభూతి తెలుపుకుంటున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా పాలెం శ్రీకాంత్ రెడ్డి మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ రెడ్డి హఠాన్మరణంతో విషాదానికి లోనయ్యానని పేర్కొన్నారు. ఎంతో నిబద్ధత, నిజాయతీ, నైతికత ఉన్న వ్యక్తి అని, ఆయనతో ఎన్నోసార్లు సంభాషించానని లోకేశ్ వెల్లడించారు. శ్రీకాంత్ రెడ్డి గర్వంలేని వ్యక్తి అని, ఓ ఆత్మీయుడు దూరమయ్యాడన్న బాధ కలుగుతోందని వివరించారు. పాలెం శ్రీకాంత్ రెడ్డి గతంలో టీడీపీ తరఫున కడప పార్లమెంటు స్థానం కోసం ఎన్నికల బరిలో దిగారు.
Chandrababu
Nara Lokesh
Palem Srikanth Reddy
Death
Corona Virus

More Telugu News