East Godavari District: కేసును డీఐజీ తప్పుదోవ పట్టిస్తున్నారు: శిరోముండనం బాధితుడు ప్రసాద్

DGP is diverting the case alleges Hairshaved victim Prasad
  • నాకు శిరోముండనం చేయించింది వైసీపీ నేత కలవ కృష్ణమూర్తి
  • కింద స్థాయి పోలీసులు అమాయకులు
  • నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలికి చెందిన దళిత యువకుడు ప్రసాద్ కు పోలీసులు శిరోముండనం చేసిన ఘటనపై రాష్ట్రపతి సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన దస్త్రాన్ని రాష్ట్రపతి భవన్ ఏపీ సాధారణ పరిపాలనా విభాగానికి బదిలీ చేసింది. అనంతరం బాధితుడు ప్రసాద్ మాట్లాడుతూ తన విన్నపం పట్ల స్పందించిన రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపాడు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని చెప్పాడు.

తనకు శిరోముండనం చేయించింది వైసీపీ నాయకుడు కలవ కృష్ణమూర్తి అని ప్రసాద్ తెలిపాడు. ఈ కేసులో కింద స్థాయి పోలీసులు అమాయకులని... ఏలూరు రేంజ్ డీఐజీ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించాడు. ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు.
East Godavari District
Seethanagaram
Hair shave
Dalit Youth
President Of India

More Telugu News