కరోనా కేసుల్లో ప్రపంచంలో ఏపీ ఘనత ఇలా ఉంది: దేవినేని ఉమ విమర్శలు
- కేసులు రెండున్నర లక్షలకు చేరుకుంటున్నాయి
- మరణాలు 2,200 దాటాయి
- దేశంలో వందకు పదిమంది ఆంధ్రులే
- దేశంలో వైరస్ ఉద్ధృతి జిల్లాలు 22 ఉంటే 13 ఏపీవే
'15 రోజుల్లో దేశంలో పెరుగుదల 0.42%, ఏపీలో 50%. ఏపీలో కరోనా అదుపుతప్పిందన్న కొవిడ్ ఇండియా వెబ్ సైట్ హెచ్చరిక మీకు కనపడుతుందా జగన్ గారు?' అని దేవినేని ఉమ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన వార్తలను పోస్ట్ చేశారు. జిల్లాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని అందులో పేర్కొన్నారు.